BIKKI NEWS (SEP. 24) : MEGA PARENT LECTURER MEETING IN GOVT JUNIOR COLLEGES ON SEPTEMBER 26th. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 26న మెగా పేరెంట్ లెక్చరర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ సంబంధిత కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
MEGA PARENT LECTURER MEETING IN GOVT JUNIOR COLLEGES ON SEPTEMBER 26th
ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్న డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య పేరెంట్ లెక్చరర్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు సంబంధించిన విద్యాపరమైన అంశాలు మరియు ఇతర అంశాలను తల్లిదండ్రులతో లెక్చరర్ కలిసి చర్చించడం ద్వారా వారి నైపుణ్యాలను పెంచేందుకు వీలు కలుగుతుంది.
ఈ మీటింగ్ ద్వారా విద్యార్థుల విద్యాభ్యాసన సామర్థ్యాలను, అటెండెన్స్, వారిలో ఉన్న పాజిటివ్ అంశాలను తల్లిదండ్రులకు వెల్లడించి విద్యార్థుల విద్యాభివృద్ధిలో వారిని కూడా ముఖ్య పాత్రధారులుగా చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.