Mahalakshmi scheme – త్వరలోనే మహిళలకు నెలకు రూ.2,500/-,

BIKKI NEWS (SEP. 23) : Mahalakshmi Scheme monthly 2500 rupees for women. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2,500/- రూపాయల ఆర్థిక సాయం అందించే ‘మహాలక్ష్మి పథకం’ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Mahalakshmi Scheme monthly 2500 rupees for women

స్థానిక సంస్థలు మరియు సర్పంచ్ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది .

ఈ పథకంలో భాగంగా.. 18 ఏళ్లు నిండిన, 55 ఏళ్ల లోపు, పింఛను పొందని తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఏటా రూ.30,000 అందుతాయి.

రాష్ట్రంలో త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.