BIKKI NEWS (AUG. 27) : loan waiver to telangana Weavers. నేతన్నల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేర్చనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం నేతన్న పొదుపు నిధుల (త్రిఫ్ట్ ఫండ్) విడుదల కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలతో కలిసి పాల్గొన్నారు.
loan waiver to telangana Weavers.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నేతన్నల రుణాలు రూ.33 కోట్ల మేర ఉన్నాయని, త్వరలో క్యాబినెట్‌లో చర్చించి నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నేతన్నల చిరకాల కోరిక అయిన నూలు బ్యాంకు ద్వారా ఇప్పటివరకు వంద సహకార సంఘాలకు 2500 టన్నుల నూలు అందజేశామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం రూ.290 కోట్ల బకాయిలు పడగా, వాటిని విడతల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్ కూడా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న బ్యాక్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని ఇటీవల లేఖ రాశారని, ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.