BIKKI NEWS (SEP. 29) : LABORATORY WORK COMPULSORY FOR 6 TO 10th CLASS. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య శాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లేబరేటరీ మాన్యువల్స్ ను విడుదల చేసింది.
LABORATORY WORK COMPULSORY FOR 6 TO 10th CLASS
ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు పాఠాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునే వీలు కల్పించేందుకు లాబోరేటరీ మాన్యువల్స్ ను విడుదల చేసినట్లు డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు మ.
ఆరు నుండి పదో తరగతి వరకు గణితం, జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్ లేబరేటరీ తరగతులు నిర్వహించాలని ఏ చాప్టర్ లో ఏ ఏ ప్రయోగాలు చేయాలో వాటిని ఎలా ఎప్పుడు చేయాలనే వివరాలతో లేబోరేటరీ మాన్యువల్స్ ను విడుదల చేశారు.