BIKKI NEWS (SEP. 07) : KALOJI AWARD 2025 TO NELLUTLA RAMADEVI . ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు.
KALOJI AWARD 2025 TO NELLUTLA RAMADEVI
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు గారి పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకమైన ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారిని ఎంపిక చేసింది.
కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి గారు రమాదేవి గారికి అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 9, 2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.
రమాదేవి రచనలు
- మనసు భాష (కవిత్వం)- 2011
- రమణీయం (కార్టూన్లు)- 2011
- మనసు మనసుకూ మధ్య (కథలు)- 2011
- చినుకులు (నానీలు) – 2021
- తల్లి వేరు (కథలు)-2021
- డి. కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్-2023
- అశ్రువర్ణం (కవిత్వం)-2024
- రమాయణం-1 (కాలమ్స్) -2024