BIKKI NEWS (JAN. 07) : JEE ADVANCED COMPUTERISED ADAPTIVE TEST. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో ప్రశ్నలు ఇవ్వాలని ఇలా విద్యార్థుల సామర్ధ్యాన్ని బట్టి వేర్వేరు ప్రశ్నలను ఇచ్చే విధానం కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్ట్ విధానం అమల్లోకి తేవాలని ఐఐటి కాన్పూర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
JEE ADVANCED COMPUTERISED ADAPTIVE TEST
దీని ద్వారా విద్యార్థులు ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం ఉంటుంది ఇది వారి నిజమైన అవగాహన కలిగిన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుందని ఐఐటి కాన్పూర్ పేర్కొంది.
అయితే సులభమైన ప్రశ్నలకు తక్కువ మార్కులు, కఠినమైన ప్రశ్నలకు ఎక్కువ మార్కులను కేటాయించడం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం జరగదని పేర్కొంది.
దీనిని 2027 జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నుంచి ప్రారంభించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
విద్యార్థులకు మొదట తేలికపాటి ప్రశ్నలను అందించడం జరుగుతుంది… వాటికి జవాబు రాస్తే కఠినత్వం పెరుగుతూ ప్రశ్నలు వస్తాయి. జవాబు రాయలేకపోతే మరింత సులభమైన ప్రశ్నలు తదుపరి ప్రశ్నలుగా వస్తుంటాయి.
మొదటగా ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలను విద్యార్థులకు నిర్వహించాలని, తద్వారా వారి సామర్థ్యం వారికి తెలిసి వస్తుందని దానికి అనుగుణంగా వారు పరీక్షకు సిద్ధమవుతారని ఐఐటి కాన్పూర్ తెలిపింది
ఈ విధానం వలన విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గుతుందని, విద్యార్థుల నిజమైన అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించేందుకు వీలవుతుందని తెలిపింది.

