BIKKI NEWS (JAN. 10) : INTERNSHIP WITH STIPEND IN DEGREE. విద్యార్థులు డిగ్రీ చదువుతోపాటు ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్న్ షిప్ కొరకు స్టైఫండ్ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
INTERNSHIP WITH STIPEND IN DEGREE.
ఇంటర్న్‌షిప్ కాలానికి స్టైఫండ్ ను యూనివర్సిటీలు, ఉన్నత విద్య మండలి నుంచి విద్యార్థులకు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు మొదటగా దీన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
2026 – 27 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ మూడవ సంవత్సరంలో ఒక సెమిస్టర్ లో ఈ అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని భావిస్తున్నారు.

