BIKKI NEWS (OCT. 05) : International Teachers day October 5th. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు
International Teachers day October 5th
అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1966 సెప్టెంబర్ 21 నుండి 15 రోజుల పాటు పారిస్లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది.
‘స్టేటస్ ఆఫ్ ది టీచర్స్’ పత్రాన్ని ఆమోదించిన అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతిఏటా సమీక్షించాలని నిర్ణయించింది.

