International Day of Non-Violence – అహింసా దినోత్సవం

BIKKI NEWS (OCT. 02) : International Day of Non-Violence October 2nd. అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటారు.

International Day of Non-Violence October 2nd

జనవరి 2004 లో ఇరాన్ నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాడీ పారిస్లోని ఒక హిందీ ఉపాధ్యాయుడి నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవం కోసం ఒక ప్రతిపాదనను అందుకున్నాడు. అతడు దాన్ని ముంబైలో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరము వద్ద ఉంచాడు. ఈ ఆలోచనపై క్రమంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తి కనబరచారు. 2007 జనవరిలో న్యూ ఢిల్లీలో సత్యాగ్రహ సమావేశంలో, ఈ ఆలోచనను స్వీకరించాలని ఐక్యరాజ్యసమితికి పిలుపునిస్తూ ఒక తీర్మానం చేసారు. ఈ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు లు తీసుకువచ్చారు

15 జూన్ 2007 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అక్టోబర్ 2 ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోడానికి ఓటు వేసింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానంలో అక్టోబర్ 2 ను “తగిన పద్ధతిలో జ్ఞాపకం చేసుకోవాలనీ, విద్య ద్వారా, ప్రజలలో అవగాహన తీసుకురావడం ద్వారా అహింసా సందేశాన్ని వ్యాప్తి చేయండం ద్వారా జరుపుకోవాలని” సభ్యులందరినీ కోరింది.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK