BIKKI NEWS (OCT. 05) : Intermediate colleges in Telangana reopen on 6th October. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు అక్టోబర్ 6వ తేదీన పునః ప్రారంభం కానున్నాయి.
Intermediate colleges in Telangana reopen on 6th Octobe
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు ఇచ్చిన దసరా సెలవులు (మిడ్ టెర్మ్) సెలవులు నేటితో ముగియనున్నాయి.
మొత్తం 9 రోజుల పాటు కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డ్ సెలవులు ప్రకటించింది.
అయితే ఈ విద్యా సంవత్సరంలో ముందస్తుగానే పబ్లిక్ పరీక్షలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే తరగతులకు హాజరు కావాలని అధ్యాపకులు కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాగే విద్యార్థులకు ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి గైర్హాజరు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు షెడ్యూలు కూడా ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

