BIKKI NEWS (AUG. 21) : Intermediate board merging in school education. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ను పాఠశాల విద్య లో విలీనం చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్లు విశ్వసినీయ సమాచారం. ఈ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
Intermediate board merging in school education
ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో ప్రస్తుతం 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉండగా, వీటిలో దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నారు..
సీబీఎస్ఈ తరహాలో పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియట్ విద్యను ఒకే బోర్డ్ కిందికి తేవాలని విద్య కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
దీని ద్వారా డ్రాప్ అవుట్ రేట్లు తగ్గడం లేక ఫలితాలు కూడా ఉత్తమంగా సాధించవచ్చును అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే అభిప్రాయాన్ని కేంద్ర విద్యా శాఖ కూడా పలు రాష్ట్రాలకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా విద్యాశాఖ పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఇదే అంశాన్ని సూచించిన సంగతి తెలిసిందే.
సీబీఎస్ఈ తరహాలో 1 నుండి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుండి 12వ తరగతి వరకు హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టం ను తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది.