BIKKI NEWS (SEP. 24) : Intermediate admissions increased in government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా అడ్మిషన్ల సంఖ్య పెరిగింది.
Intermediate admissions increased in government junior colleges
గత విద్యా సంవత్సరంలో 83,635 అడ్మిషన్లు కాగా ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ 24 నాటికి 91,853 అడ్మిషన్లు పూర్తయినట్లు బోర్డు ప్రకటించండి.
దీంతో గత విద్యా సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరంలో 8,218 అడ్మిషన్ల సంఖ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెరగటం విశేషం.
ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తీసుకుంటున్న చర్యలు, కళాశాలల వారీగా ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకులు 10వ తరగతి పూర్తి అయిన విద్యార్థుల ఇంటింటికి వేసవి సెలవుల్లో సైతం తిరిగి అడ్మిషన్ డ్రైవ్ చేపట్టడంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది.