- BIKKI NEWS : 22-01-2026
Inter English second year practical exam today. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు ఇంటర్మీడియట్ సెకండీయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను నిర్వహిస్తుంది.
Inter English second year practical exam today
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 వరకు ఈ పరీక్షను నిర్వహింఛనున్నారు. ఇందుకోసం విద్యార్థులకు హాల్ టికెట్లను ఇప్పటికే కళాశాల లాగిన్ లలో అందుబాటులో ఉంచారు.
విద్యార్థులు బోర్డు నిర్వహించే పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది . హాజరు కాకున్న, ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ లో ప్రధాన సబ్జెక్టులు అన్ని పాస్ అయిన ఫెయిల్ అయినట్లే మెమోలో వస్తుంది. కావున విద్యార్థులు ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి.
ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్యార్థులలో ఇంగ్లీష్ పై పట్టు పెంచుటకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుటకు ఈ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
20 మార్కులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్నల్ పరీక్షలుగా నిర్వహిస్తున్నారు. మిగతా 80 మార్కులకు థియరీ పరీక్షకు కేటాయించారు.
విద్యార్థులలో రీడింగ్, లిజనింగ్, రైటింగ్ , కాంప్రహెన్షన్, గ్రూప్ డిస్కషన్, ఎక్స్‌ప్రెషన్ వంటి అంశాల మీద ఇంగ్లీష్ ప్రాక్టికల్ లో అంశాలు ఉన్నాయి.
2026 -27 విద్యా సంవత్సరం నుండి అన్ని సబ్జెక్టులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు బ్యాక్ లాగ్ విద్యార్థులకు నిర్వహిస్తారు
24న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ పరీక్ష ఫస్టీయర్ విద్యార్థులకు, బ్యాక్ లాగ్ విద్యార్థులకు నిర్వహిస్తారు.

