- BIKKI NEWS : 20-01-2026
Inter board held a meeting On Humanities and Languages. ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కార్యదర్శి అధ్యక్షతన, మానవీయ శాస్త్రాలు (హ్యూమానిటీస్) మరియు భాషల విభాగానికి చెందిన విషయ నిపుణుల కమిటీ సభ్యులు మరియు రచయితలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) మరియు విద్యా విధాన చైర్మన్ డా. కె. కేశవ రావు గారు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.
Inter board held a meeting On Humanities and Languages.
ఈ సమావేశంలో డా. కె. కేశవరావు గారు, పాట్య ప్రణాళిక రూపకల్పనలో మానవ విలువలు, నైతికత, వాస్తవ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ను రూపొందిందాలని కమిటీ సభ్యులకు సూచించారు. ప్రస్తుతకాల అభివృద్ధులను ప్రతిబింబించే విధంగా, విద్యార్థుల స్థాయికి అనుకూలంగా సిలబస్ ను రూపొందించాలని విషయ నిపుణులకు దిశా నిర్దేశం చేశారు.
విద్య అనేది ప్రపంచాన్ని చూడడానికి ఒక సాదనమని, అది విద్యార్థులను సిద్ధాంతపరంగా మరియు ప్రాయోగికంగా శక్తివంతులను చేయాలని ఆయన పేర్కొన్నారు. విద్య మానవ విలువలను నాటాలి. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి, అలాగే విద్యార్థి కేంద్రితంగా, ప్రశ్నించే స్వభావాన్ని కలిగి ఉండాలని అన్నారు. ప్రపంచ పరిస్థితులు మారుతున్న కొద్దీ విద్య కూడా నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, విద్య అనేది విద్యార్థులు ప్రపంచాన్ని చూసే కిటికీ అని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్య మండలి లో నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ పని తీరును అభినందించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరంనుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబసన్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కొత్తగా రూపొందించిన ఈ సిలబస్ ప్రస్తుత విద్యారంగ అవసరాలను సమర్ధవంతంగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ సబ్జెక్టు నిపుణులు సిలబస్ రూపకల్పనలో వారు అనుసరించిన విధానాలను మరియు వారి అభిప్రాయాలు తెలియచేసారు.

