INDIRAMMA INDLU – పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు

BIKKI NEWS (JULY 24) : INDIRAMMA INDLU IN URBAN AREAS. తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలలోనూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

INDIRAMMA INDLU IN URBAN AREAS.

తొలి దశలో జీహెచ్ ఎంసీలో అమలు చేయనున్నారు.

పేదలు నివసిస్తున్న చోటే జీ+3 పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు.

అవసరమైన స్థలాలను గుర్తించి. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ.

ఇందుకోసం ప్రతి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలి ఆదేశాలు జారీచేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని 166 మురికివాడల్లో సుమారు 42,432 మంది నివాసం. హైదరాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్ మల్కాజిగిరిలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడల్లో సర్వే. చేయడం జరిగింది.

4 జిల్లాల పరిధిలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ 30 వేల ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

ఇల్లు దక్కినా, వెళ్లని వారికి నోటీసులు జారీ చేయనున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.