BIKKI NEWS (AUG. 18) : INDIRAMMA INDLU GOOD NEWS. పేదల చిరకాల వాంఛ నెరవేరుతోందని.. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైందని, భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కాగా..అదే భద్రాద్రి రాముని ఆశీస్సులతో గృహప్రవేశం జరగడం ఒక చారిత్రక ఘట్టంమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
INDIRAMMA INDLU GOOD NEWS.
లక్ష మందితో జరగనున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం మహోత్సవం ఆగస్టు 21వ తేదీ గురువారం రోజున శ్రావణ మాస శుభ ముహూర్తంలో బెండలపాడు గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించనున్నారు.
బెండలపాడు గ్రామంలో మొత్తం 312 ఇండ్లు మంజూరవ్వగా, వాటిలో 72 ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యాయి. అందులో 27 ఇండ్లకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనుంది.
పేదవాడి కలలను నిజం చేస్తూ పండగలా జరిగే ఈ గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఎటువంటి సమస్యలు తలెత్తకుండాా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.