BIKKI NEWS (OCT. 08) : INDIAN AIRFORCE DAY OCTOBER 8th. భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న నిర్వహించబడుతుంది. భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) 1932, అక్టోబరు 8వ తేదీన స్థాపించబడి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరుపొందింది.
INDIAN AIRFORCE DAY OCTOBER 8th
అంతటి శక్తివంతమైన వైమానిక దళం యొక్క సేవలను గుర్తిస్తూ ప్రతిఏటా అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది
1932, అక్టోబర్ 8న ఏర్పడిన భారత వైమానిక దళం బ్రిటీష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. దానికి గుర్తుగా 1945లో రాయల్ భారత వైమానిక దళంగా మార్చబడింది.
1950లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత భారత వైమానిక దళంగా రూపాంతరం చెందింది. 1933 ఏప్రిల్ 1న భారత వైమానిక దళానికి తొలి ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చింది. తొలినాళ్ళలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్ మాత్రమే ఉండేవారు.


Comments are closed.