BIKKI NEWS (JULY 14) : India lost Lord’s Test against England. టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదిక జరిగిన మూడో టెస్టులో భారత జట్టు చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. రవీంద్ర జడేజా వీరోచిత పోరాటం కారణంగా ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్ విజయం పై ఆశలు పెట్టుకుంది . అయితే చివరకు ఓటమి తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 2-1తో లీడ్ లో ఉంది.
India lost in Lord’s Test against England.
83 పరుగులకే కీలకమైన 7 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రవీంద్ర జడేజా మొదట నితీష్ కుమార్ రెడ్డితో తర్వాత బుమ్రాతో తరువాత సిరాజ్ తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి విజయం పై ఆశలు రేకెత్తించాడు.
జడేజా 61* పరుగులతో నాటాట్ గా మిగిలిపోయాడు. టీమిండియా 170 పురుగులకు ఆలౌట్ అయింది
సంక్షిప్త స్కోర్
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ – 1 : 387/10
ఇండియా ఇన్నింగ్స్ – 1 : 387/10
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ – 2 : 192/10
ఇండియా ఇన్నింగ్స్ – 2 : 170/10