IND vs NZ – ఉత్కంఠ పోర భారత్ ఘనవిజయం

INDIA BEATS NEWZEALAND IN VADODARA ONE DAY

INDIA BEATS NEWZEALAND IN VADODARA ONE DAY. న్యూజిలాండ్ తో వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠ భరితమైన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

INDIA BEATS NEWZEALAND IN VADODARA ONE DAY

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు టాపార్డార్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్ లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. మిచెల్ 84, నికోలస్ 62, కాన్వే 56 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో సిరాజ్, రాణా, ప్రసిద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు. కులదీప్ ఒక వికెట్ తీశాడు.

KOHLI UNSTOPPABLE

అనంతరం 301 పరుగుల లక్ష్యంతో బదిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ గిల్(56) , విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (49) శుభారంభం ఇచ్చారు. విరాట్ కోహ్లీ (93) పరుగులు చేసి అవుటయిన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆట రసవత్తరంగా మారింది. కేఎల్ రాహుల్ చివరి వరకు నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ బౌలర్ల లో జెనిసన్ 4 వికెట్లు తీసి భారత్ అభిమానులను టెన్షన్ పెట్టాడు.

3 వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో ముందంజలో నిలిచింది.

RO KO HIT PAIR

విరాట్ కోహ్లీ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని ఈ వన్డే తో మరోసారి నిరూపించాడు. అలాగే రోహిత్ శర్మ ఉన్నంతసేపు సాధికారికంగా ఆడి తన సత్తా చూపించాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా రో కో జోడి గత రెండు సిరీస్ ల నుండి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో కూడా ఈ దిక్కుతో ఆటగాళ్లు రాణించి సెలెక్టర్లకు పరీక్ష పెట్టనున్నారు.

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లను గెలుచుకున్న ఆటగాళ్ళ జాబితాలో విరాట్ కోహ్లీ (45) సచిన్ (62), జయసూర్య (48) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.

టీం ఇండియా ఇప్పటి వరకు 20 సార్లు 300 కు పైగా టార్గెట్ లను ఛేదించిన ఏకైక జట్టు గా నిలిచింది. రెండో స్థానంలో ఇంగ్లాండ్ జట్టు (15). ఉంది.

50+ స్కోర్ లను 5 అంతకంటే ఎక్కువ సార్లు వరుసగా చేయడం కోహ్లీ కి ఇది 5 వ సారి కావడం విశేషం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK