- BIKKI NEWS : 17-01-2026
U19 WORLD CUP – INDIA BEATS BANGLADESH IN U19 WORLD CUP. ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యంగ్ టీమిండియా సంచలన విజయం సాధించింది. 18 పరుగుల తేడాతో (DLS) విజయం సాధించింది.
INDIA BEATS BANGLADESH IN U19 WORLD CUP
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ యువ జట్టు 238/10 పరుగులు సాధించింది. కుందూ- 80, సూర్యవంశీ – 72 పరుగులతో రాణించారు.
అనంతరం డక్ వర్తు లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ కు 29 ఓవర్ లలో 165 పరుగులు టార్గెట్ విధించారు.
అయితే బంగ్లాదేశ్ జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విహన్ మల్హోత్రా – 4, పటేల్ – 2 వికెట్లు తీసి కీలక సమయంలో రాణించారు. దీంతో యంగ్ ఇండియా ఈ వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయం సాధించింది.

