BIKKI NEWS (SEP. 07) : High court ordered for regularise BHEL contract employees. BHEL సంస్థలో గత పది సంవత్సరాలుగా పారామెడికల్ సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
High court ordered for regularise BHEL contract employees.
కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు పొందుతూ శాశ్వత నియామకానికి నిరాకరించడం వివక్షపూరితమేనని ఈ సందర్భంగా హైకోర్టు తప్పుబట్టింది.
చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందేనని, సంబంధించి ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ అంశంపై పేర్కొందని తెలిపింది.
బీహెచ్ఈఎల్ లో పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టి, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి.. దశాబ్దకాలానికి పైగా ఉద్యోగుల సర్వీసులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారంటే వారి సేవలు అవసరమని తెలుస్తోందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగులను సుదీర్ఘకాలం కొనసాగించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. అందువల్ల వారు రెగ్యులర్ నియామకానికి అర్హులేనని, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని బీహెచ్ఈఎల్ ను ఆదేశించారు.