Teachers promotions – టీచర్ల పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

BIKKI NEWS (AUG. 21) : High court given green signal for teachers promotions. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది.

High court given green signal for teachers promotions

సీనియారిటీ విషయమై కొందరు టీచర్లు హైకోర్టు కేసు వేయడంతో ఇటీవల హైకోర్టు స్టే విధించింది. తాజాగా దాన్ని ఎత్తివేసింది. దీంతో మొత్తం మీద 3,867 మంది టీచర్లకు లబ్ది చేకూరనుంది.

దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆగస్టు 20 రాత్రి గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 21 ఉదయం 9 గంటలకు వారు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

మల్టీ జోన్-1లో 491 మందికి, మల్టీ జోన్-2లో 411 మందికి… మొత్తం 902 మందికి గెజిటెడ్ హెడ్ మాస్టర్ లుగా ప్రమోషన్ లు లభించనున్నాయి.

ఆ తర్వాత 2,324 మంది ఎన్టీజీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, మరో 641 మంది ఎస్జీటీ లకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ కల్పించనున్నారు.