BIKKI NEWS (SEP. 20) : H1B VISA 1 LAKH DOLLARS. విదేశీయుల కోసం అమెరికా జారీ చేసే H1B వీసాల వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు పిడుగు లాంటి వార్త.
H1B VISA 1 LAKH DOLLARS
ఇప్పటివరకు నామమాత్రంగా ఫీజు ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెరగడంతో చాలా మందికి అమెరికా వెళ్లాలని కలగాలని మిగిలిపోనుంది.
H1B వీసా ద్వారా అమెరికా వెళ్ళే విదేశీయులలో 70 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. రెండో స్థానంలో చైనా ఉంది.
ఏటా దాదాపు 85 వేల హెచ్1బి వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటిని లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు.
అలాగే ట్రంప్ సర్కార్ గోల్డెన్ కార్డును కూడా తీసుకువచ్చింది. దీని విలువ 10 లక్షల డాలర్లు. ఇది తీసుకున్న వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది.