BIKKI NEWS (NOV. 06) : Guest lecturers jobs in Hanamkonda DIET college. హనుమకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు.
Guest lecturers jobs in Hanamkonda DIET college
అభ్యర్థులను అధ్యాపకులుగా (గెస్ట్ ఫ్యాకల్టీ) ఎంపిక చేసే సమయానికి 65 ఏళ్ల వయసులోపు ఉన్న రిటైర్డ్ / నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కళలు-కళావిద్య ఒక పోస్టుకు విద్యార్హతలు ఫైన్ ఆర్ట్స్/మ్యూజిక్/డాన్స్/ థియేటర్ మొదలైన వాటిలో మాస్టర్స్ (ఎంఎ ఎఏ) బ్యాచిలర్స్ (బీఎస్ఏ) డిగ్రీ కలిగి ఉండాలి. గౌరవ వేతనం రూ.15600.
ఉర్దూ మీడియలో ఫిలాసఫీ/ సోషియాలజీ/ సైకాలజీ ఒక పోస్టుకు విద్యార్హ తలు సంబంధిత సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), ఎంఈడీ కలిగి ఉండాలి. గౌరవ వేతనం రూ.23400.
ఉర్దూ మీడియంలో పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు. విద్యార్హతలు గణితం సబ్జెక్టులలో పోస్టు గ్రాడు యేషన్ (పీజీ), ఎంఈడీ కలిగి ఉండాలి. గౌరవ వేతనం రూ.23400.
కళాశాలలో ఇచ్చే దరఖాస్తును పూర్తి చేసి ఒక ఫొటొ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను జత చేసి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ, హనుమకొండలో నవంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు సమర్పించాలి.
నవంబర్ 14న తుది జాబితా ప్రకటించి మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్ప త్తిలో నవంబర్ 15న డెమో/ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు .
17న 2025-26 అకడమిక్ సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీగా డైట్ లో రిపోర్టు చేయాలని తెలిపారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

