BIKKI NEWS (SEP. 03) : Guest degree lecturers jobs in GDC WOMEN JAGTIAL జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి గాను కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ పోస్ట్ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు .
Guest degree lecturers jobs in GDC WOMEN JAGTIAL
ఈ పోస్ట్ ను గెస్ట్ పద్దతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత సబ్జెక్టులలో పీజీ లో 55% మార్కులు ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. పీహెచ్డీ ,నెట్/సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును, బోధన అనుభవం సర్టిఫికెట్ గల వారికి ప్రాదాన్యత ఇవ్వబడును.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులను సంబంధిత సర్టిఫికెట్స్ జిరాక్స్ తో పాటు కళాశాల కార్యాలయం లో సమర్పించాలని తెలిపారు.
సెప్టెంబర్ 6వ తేదీన, శనివారం రోజు ఉదయం 10 గంటలకు కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించబడునని తమ ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు హాజరుకావాలని తెలిపారు.