BIKKI NEWS (JULY 26) : GRATUITY FOR CONTRACT EMPLOYEES – HIGH COURT ORDERS. ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న 13 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా గ్రాట్యుటీ చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
GRATUITY FOR CONTRACT EMPLOYEES – HIGH COURT ORDERS.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలంటూ లేబర్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేస్తూ ఎయిర్ ఇండియా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ నగేష్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ ఇండియా లాంటి సంస్థ ఆదర్శ యజమానిగా ఉండాలని కాంట్రాక్టు ద్వారా పనిచేస్తున్నప్పటికీ విధులను ఎయిరిండియాలోనే నిర్వహిస్తున్నందువల్ల రెగ్యులర్ కార్మికులతో సమానంగా గ్రాట్యుటీ చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.