BIKKI NEWS (JULY 16) : Free training for women by SBI. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ మహిళలకు ఉచితంగా జూట్ బ్యాగు ల తయారీ కొరకు ఉచిత శిక్షణ అందించడానికి ప్రకటన విడుదల చేసింది.
Free training for women by SBI.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉచితంగా శిక్షణ తో పాటు భోజనం, వసతి, సౌకర్యం ఇవ్వనున్నారు.
శిక్షణ కాలం : జూలై 18 నుంచి 14 రోజులపాటు ఉండనుంది. ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు.
అర్హతలు & కావలసిన పత్రాలు :
- పదో తరగతి మార్కుల మెమో జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- రేషన్ కార్డు జిరాక్స్
- బ్యాంక్ పాస్ బుక్
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
వయోపరిమితి : 19 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ అందించే స్థలం : SBI – RSETI, తిమ్మాపూర్, కరీంనగర్, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా, తిమ్మాపూర్