BIKKI NEWS (AUG. 29) : FREE Gouds SAFTEY KIT. బతుకుదెరువు కోసం వృత్తినే దైవంగా భావిస్తూ నడుముకు మోకు కట్టుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆకాశాన్నంటే తాటి చెట్లను ఎక్కే గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు మన ప్రజా ప్రభుత్వం ‘కాటమయ్య రక్షక కవచం’ (భద్రతా కిట్)ను తయారుచేసి అందిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
FREE Gouds SAFTEY KIT
రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కల్లు గీత కార్మికులకు పూర్తి స్థాయిలో కాటమయ్య రక్ష కిట్‌లను అందించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈత, తాటి చెట్లు ఎక్కే సమయంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాటమయ్య రక్ష కిట్లను తయారుచేయడం జరిగిందని మంత్రి తెలిపారు
ఈరోజు కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ , స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి 80 మంది గీత కార్మిక సోదరులకు కాటమయ్య రక్షక కిట్‌లను పంపిణీ చేయడం జరిగింది. ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కాటమయ్య రక్షక కిట్‌లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. గీత కార్మికుల ఇతర సమస్యల తొలగించేందుకు ప్రభుత్వం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తెలిపారు.
అన్నివర్గాల వారిని అక్కున చేర్చుకుంటూ..పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందిస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు రూ. 500 బోనస్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు.