BIKKI NEWS (AUG. 24) : FREE CURRENT FOR GANESH NAVARATHRI CELEBRATIONS. గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
FREE CURRENT FOR GANESH NAVARATHRI CELEBRATIONS
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 06వ తేదీ వరకు గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని TGSPDCL స్పష్టం చేసింది.
అలాగే దసరా కు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు కూడా ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
దీని కొరకు గణేష్ మరియు దుర్గాదేవి మండప నిర్వాహకులు విద్యుత్ పంపిణీ సంస్థకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.