BIKKI NEWS (DEC. 19) : FORENSIC AUDIT ON CONTRACT AND OUTSOURCING EMPLOYEES. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల లెక్క తేల్చడానికి ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
FORENSIC AUDIT ON CONTRACT AND OUTSOURCING EMPLOYEES.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలను ప్రభుత్వానికి సమర్పించి వారి వేతనాలు ప్రభుత్వం నుంచి స్వీకరిస్తున్నారు. వాస్తవానికి ఏజెన్సీలు, విభాగాధిపతులు చూపిస్తున్నంత మంది ఉద్యో గులు పనిచేస్తున్నారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఆధార్ కార్డులను సేకరించాం. వీటి సాయంతో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల లెక్కలు తేల్చేందుకు రికార్డుల్లో ఉన్న ఉద్యోగులు వాస్తవంగా లేకపోయినా, తప్పుడు ఆధారాలతో వేతనాలు తీసుకున్నారని తేలినా. . వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద చర్యలు తీసుకుంటాం. పింఛన్లలో కూడా గతంలో అవకతవకలు జరిగాయి. వీటిపైనా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం. ఆరోపణలు రుజువైతే.. బాధ్యులను జైలుకు పంపిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని, పింఛన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు.

