Flood Alert : 10 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు

BIKKI NEWS (AUG. 27) : Flood alert districts in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్,కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Flood alert districts in Telangana

ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది ‌

మిగిలిన 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కావున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అనవసరం ప్రయాణాలు పెట్టుకోవాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలోని విద్యాసంస్థలకు గురువారం రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.