Engineering counseling – మాక్ సీట్లను మార్చుకున్న సగం మంది విద్యార్థులు

BIKKI NEWS (JULY 17) : Engineering counselling 2025 in telangana. తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన మాక్ సీట్ల కేటాయింపు 100% విజయవంతమైంది. ఈనెల 13వ తారీఖున మాక్ సీట్లను విద్యార్థులకు కేటాయించింది.

Engineering counselling 2025 in telangana

మాక్ సీట్లు పొందిన విద్యార్థులలో 47.2% మంది ఆప్షన్లు మార్చుకున్నారు. వారిలో కొంతమంది కళాశాలల ప్రాధాన్యాన్ని మార్చుకోగా, మరికొంతమంది ఇంజనీరింగ్ బ్రాంచ్ ల ప్రాధాన్య క్రమాన్ని మార్చుకున్నారు.

తక్కువ ఆప్షన్ లు నమోదు చేసుకున్న చాలామంది విద్యార్థులకు మాక్ కౌన్సిలింగ్లో సీట్లు దక్కలేదు. ఇలాంటి వారు ప్రస్తుతం మళ్లీ ఆప్షన్లు ఎక్కువగా పెట్టడం జరిగింది.

మొదటి విడత తుది సీట్ల కేటాయింపును జూలై 18 వ తేదీన కేటాయించనున్నారు.

మాక్ సీట్లు కేటాయింపు అనేది విద్యార్థులకు రెండో అవకాశాన్ని ఇచ్చిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. దీని ద్వారా మొత్తం 2.6 లక్షల ఆప్షన్లు పెరిగాయని తెలిపారు.