- BIKKI NEWS : 22-01-2026
EMPLOYEES JAC CHAIRMAN LACCHI REDDY MEET CS RAMAKRISHNA RAO. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి సీఎస్ రామకృష్ణారావునును కలిసి వినతి పత్రం సమర్పించారు.
EMPLOYEES JAC CHAIRMAN LACCHI REDDY MEET CS RAMAKRISHNA RAO
సీపీఎస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి మరణించిన తేది నుంచి మంజూరు చేయాలని సూచించారు.
అలాగే సీపీఎస్ ఉద్యోగులు చెల్లించే 10 శాతం సీపీఎస్ కాంట్రిబ్యూషన్ తో పాటు ప్రభుత్వం చెల్లించే 10 శాతం సీపీఎస్ కాంట్రిబూషన్ సకాలంలో చెల్లించాలని తెలిపారు.
డీఏ ఏరియర్స్ ను వాయిదాల్లో కాకుండా ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 10% సీపీఎస్ కాంట్రిబూషన్ ను కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 14 శాతానికి పెంచాలని తెలిపారు.
2023 బ్యాచ్ జేఎల్స్, డీఎల్స్ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటూ వినతి
రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసులను క్రమబద్దీకరించారని గుర్తు చేశారు. చేశారు. కానీ నేటికి వారి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకపోగా ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. వారి సమస్యన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అర్హులైన తహశీల్దార్లు ఉన్నప్పటికీ వారికి పదోన్నతి కల్పించడం లేదని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన మొదటి, రెండో త్రైమాసికాల కోసం తహశీల్దార్లకు నెలకు రూ.33 వేల చొప్పున అద్దె వాహనాల ఖర్చులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.
ఉద్యోగుల సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు కుమార స్వామి, ఎస్. రాములు, రమేష్ పాక, దర్శన్ గౌడ్, రజిని, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

