EMPLOYEES INSURANCE – ఉద్యోగులకు 1.25. కోట్ల ప్రమాద భీమా

BIKKI NEWS (SEP. 24) : Employees health insurance upto 1.25 crore in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య ప్రమాద బీమాను దేశంలోనే అత్యుత్తమంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Employees health insurance upto 1.25 crore in telangana

ఈ మేరకు శాలరీ ఎకౌంటు ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1.25 నుండి 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా కల్పించేలా బ్యాంకులతో ఆర్థిక శాఖ చర్చలు జరుపుతోంది.

సింగరేణి కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల ప్రమాద బీమా వర్తింపజేసేలా ఆ సంస్థ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమాదం సంభవించినప్పుడు 1.25 నుండి 1.50 కోట్లువరకు ప్రమాద భీమా వర్తించేలా శాలరీ ఎకౌంటు ఉన్న బ్యాంకులతో ఆర్థిక శాఖ చర్చలు జరుపుతోంది.

ఎస్బీఐలో శాలరీ ఎకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు రూ. కోటి బీమా చెల్లిస్తోంది.

విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.1.60 కోట్లు, రూపే డెబిట్ కార్డు ఉంటే మరో రూ.కోటి ఇస్తోంది.

శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. కోటి, సహజ మరణం అయితే రూ.10 లక్షలు అందజేస్తోంది.

నెలకు రూ.2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తోంది.

ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు ఉచితం