BIKKI NEWS (SEP. 20) : Employees data updation on IFMS portal today. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఆన్లైన్ లో సెప్టెంబర్ 20 (శనివారం) లోగా అప్లోడ్ చేయాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Employees data updation on IFMS portal today.
సెప్టెంబరు వేతనం వచ్చే నెల ఒకటిన విడుదల కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది.
ఇదేవిధంగా ప్రతి నెల 10 తేదీలోగా ఉద్యోగుల వివరాలు అప్ లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
కేవలం శాశ్వత(రెగ్యులర్) ఉద్యోగులే కాకుండా, రోజువారీ వేతనంపై పనిచేసేవారు, కాంట్రాక్టు (ఒప్పంద), గెస్ట్. గంటల ప్రాతిపాదికన పనిచేసేవారు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితర అన్ని రకాల ఉద్యోగుల వివరాలన్నీ IFMS పోర్టల్ లో అప్లోడ్ చేయాలని పేర్కొంది.
వాటిని సంబంధిత శాఖాధిపతి ఆమోదించి ఆర్థికశాఖకు పంపాలని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల వివరాలన్నీ ప్రతినెలా అప్లోడ్ అయ్యేలా చూడాలని అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సూచించింది.