DEECET SPOT COUNSELLING – డీఈడీ స్పాట్ కౌన్సిలింగ్

BIKKI NEWS (AUG. 18) : DEECET 2025 SPOT COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలోని డీఈడీ కోర్సులలో మిగిలిన సీట్లు భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.

DEECET 2025 SPOT COUNSELLING

ఆగస్టు 19, 20వ తేదీల్లో డీఈఈసెట్ 2025 రాసిన అభ్యర్థులకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

రాష్ట్రం వ్యాప్తంగా 1,131 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో ప్రభుత్వ డైట్ కళాశాలలో 235, ప్రైవేట్ డైట్ కళాశాలలో 579 సీట్లు మిగిలిపోయాయి.

ఆగస్టు 19న ప్రభుత్వ కళాశాలలోని మిగిలిన సీట్లకు, ఆగస్టు 20న ప్రైవేటు కళాశాలలోని మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx