DASARA HOLIDAYS – 27 నుండి దసరా సెలవులు

BIKKI NEWS (SEP. 25) : Dasara holidays for Anganwadi centres in telangana. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 04 వరకు సెలవులు ప్రకటించారు.

Dasara holidays for Anganwadi centres in telangana.

అక్టోబర్ 5 ఆదివారం కావడంతో అక్టోబర్ 6న అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క సూచించిన నేపథ్యంలో సెలవులు ప్రకటించారు.

సెలవులలో టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీలకు దసరా సెలవులను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసిన ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు.

వారి విజ్ఞప్తి మేరకు 8 రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీత కప్పు కృతజ్ఞతలు తెలిపిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు