BIKKI NEWS (AUG. 22) : Criminal cases on fake certificate job holders. తెలంగాణవో 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 59 మంది అభ్యర్థులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Criminal cases on fake certificate job holders
వీరిలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాలకు చెందిన 54 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, ముగ్గురు ఫైర్ మెన్, ఇద్దరు వార్డర్లు కలిసి 59 మంది నకిలు బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. 2022 ఏప్రిల్ 25న కానిస్టేబుల్, ఫైర్మన్, వార్డర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. తుది ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా 59 మంది అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ సర్టిఫికెట్లు నకిలీవని బోర్డు గుర్తించింది.
గతంలోనే వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, వారిచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసు ఉద్యోగాల నియాకశమండలి 59 మంది ఎంపికను రద్దు చేస్తూ మే 1, 2025న హైదరాబాద్ పోలీసులకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని మెమో ద్వారా సూచించింది.
బోర్డు ఆదేశాల మేరకు సీసీఎస్ ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 120-బి కింద 59 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును సీసీఎస్ లోని సిట్ బృందానికి అప్పగించారు.