12,055 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యువల్

BIKKI NEWS (JULY 24) : Contract employees renewal in PR and RD department. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో వివిధ కేటగిరీల కింద పనిచేస్తున్న 12,055 మంది కాంట్రాక్ట్ , ఫిక్స్డ్ టెన్యూర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును 2026 మార్చి 31 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Contract employees renewal in PR and RD department.

వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాల అమల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న వివిధ కేటగిరీల వారికి రెన్యువల్ అవకాశం లభించింది.

అయితే 2025 మార్చి 31 తోనే వీరు కాంట్రాక్ట్ సర్వీస్ ముగియగా… ఏప్రిల్ 01 – 2025 నుంచి వచ్చే మార్చి 31 – 2026 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.