Farmer’s News – ఎకరాకు రూ.10వేల నష్ట పరిహారం : మంత్రి జూపల్లి

BIKKI NEWS (AUG. 19) : Compensation of Rs. 10,000 per acre. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు .

Compensation of Rs. 10,000 per acre.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. రైతుల పట్ల మానవతా దృక్పథంతో ఎకరాకు రూ. 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్ గంగా గెస్ట్ హౌజ్ లో మంత్రి జూపల్లి జిల్లా స్థాయి సమీక్షించారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ, వరద నష్టంపై శాఖల వారీగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆ మేరకు నిధులు కేటాయించాలని కోరతానని తెలిపారు.

వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.