తెలంగాణ విద్యా విధానం నేడు సీఎం సమీక్ష

BIKKI NEWS (SEP. 17) : CM Review on Telangana Education Policy today. తెలంగాణ విద్యా విధానం (TEP) రూపకల్పన పై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులు మరియు విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

CM Review on Telangana Education Policy today

ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డా. కేశవరావు అధ్యక్షత వహించనున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా (కన్వీనర్‌), టిజీహెక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాల కిష్టారెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ కమిటీ జాతీయ విద్యా విధానం 2020లోని అంశాలను తెలంగాణ సందర్భానుసారంగా మార్చి పరిశీలించనుంది. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమన్వయం చేయడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్షిప్‌ అంశాలపై దృష్టి సారించనుంది.

ఇకపోతే పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి, నైపుణ్య మరియు వృత్తిపరమైన విద్యా రంగాల్లో సమగ్ర సంస్కరణలను సూచించనుంది. పరిశోధన, పరిశ్రమలతో విద్యా రంగం అనుసంధానంపై సలహాలు ఇవ్వనుంది.

ఈ కమిటీ తమ నివేదికను 2025 అక్టోబర్‌ 30లోపు ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.