BIKKI NEWS (DEC. 14) :BSc Horticulture admissions 2025. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 సంవత్సరానికి భర్తీ కాని హార్టికల్చర్ బీఎస్సీ (హానర్స్) డిగ్రీ కోర్సు సీట్ల కోసం కౌన్సెలింగ్ ను డిసెంబర్ 17 న ఉదయం 10.30 గంట ల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్ కౌన్సెలింగ్ కు హాజరుకావాలని సూచించారు.
BSc Horticulture admissions 2025
బైపీసీతో ఈఏపీసెట్ -2025 లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో 15 సీట్లు, వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన కళాశాలలో 32 సీట్లు, మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల కళాశాలలో 10 సీట్లు భర్తీ కాకుండా మిగిలినట్లు తెలిపారు.
రాజేంద్రనగర్లోని జయ శంకర్ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ సెంటర్ లో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.
వెబ్సైట్ :www.skltghu.ac.in
www.pjtau.edu.in

