BSc Agriculture – నేటి నుండి అగ్రి, వెటర్నరీ, హార్టికల్చర్ కౌన్సిలింగ్

BIKKI NEWS (AUG. 19) : BSc Agriculture counselling starts today. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు నుంచి 23 వరకు తొలి దశ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

BSc Agriculture counselling starts today

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటనలో తెలిపారు.

అగ్రి వర్సిటీతోపాటు పీవీ నర్సంహరావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సులకు తొలి దశ సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఎఫ్‌సెట్ 2025 ర్యాంకు ఆధారంగా మెరిట్ లిస్టును ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : https://www.pjtau.edu.in/