BIKKI NEWS (JULY 05) : Board observer Kishan Naik suprise visit to GJC Kondapaka. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డ్ అబ్జర్వర్ కిషన్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు.విద్యార్థులు & అధ్యాపకులతో ముఖముఖి సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా వచ్చే బోర్డు పరీక్షల్లో 100% ఫలితాలు సాధించేలా టార్గెట్ తో పనిచేయాలని, ఇంకా అడ్మిషన్స్ పెంచేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు.
Board observer Kishan Naik suprise visit to GJC Kondapaka
తెలంగాణ విద్యాశాఖ జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టిన ఐఐటీ & ఎంసెట్ కోచింగ్ ఫిజిక్స్ వాలా తరగతులను కచ్చితంగా విద్యార్థులకు నిర్దేశించిన తరగతులలో బోధించాలని సూచించారు.ప్రభుత్వ విద్యాభివృద్ధికై తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయం అని వారు అన్నారు. కాలేజీల్లో జరుగుతున్న ప్రతి విషయాన్నీ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ నిరంతరం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హరిప్రసాద్ నాయుడు కళాశాల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైనా బస్సు సౌకర్యం మరియు హాస్టల్ వసతి గురించి వివరించగా పరిష్కరించేందుకు ఉన్నత అధికారులతో మాట్లాడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది శ్రీనివాస్, అమరేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీలీల, రాములు గాదె వెంకన్న సత్యనారాయణ , అనిత, మహేందర్, హిమబిందు, పద్మ బోధనేతర సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

