BIKKI NEWS (OCT. 28) : Attendance exemption for intermediate public exams 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు మినహాయింపు అవకాశం ఇస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Attendance exemption for intermediate public exams 2026.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) నుంచి మిగతా విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా 2026 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE 2026) కోసం హాజరు మినహాయింపుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రస్తుతం కళాశాలలో చదవని విద్యార్థులకు , అలాగే గ్రూప్ మార్పు కోరేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ప్రధాన వివరాలు:
- కళాశాల విద్య లేకుండా ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూపుకు ప్రైవేట్ అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
- సైన్స్ నుండి ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూప్‌కు మారదలచిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
- ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు రెండవ భాష అదనంగా రాయడానికి అవకాశం.
- బైపీసీ పూర్తిచేసిన వారు గణితాన్ని మాత్రమే అదనంగా రాయొచ్చు.
- హాజరు మినహాయింపు కోసం ఫీజు రూ.500/-. నవంబర్ 17వరకు, ఆలస్య రుసుముతో రూ.200/ తో 29-11-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి, బోర్డు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అర్హత:
- పదో తరగతి ఉత్తీర్ణులై ఒక సంవత్సరం గ్యాప్ ఉన్నవారు 1వ సంవత్సరం పరీక్షలకు, రెండేళ్లు గ్యాప్ ఉన్నవారు 1వ, 2వ సంవత్సరం పరీక్షలకు అర్హులు.
- ఇతర బోర్డుల పరీక్ష నిల్వ అభ్యర్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందాలి.
- ముందస్తుగా ప్రమేయాలేని, డాక్యుమెంట్లు పూర్తి చేసిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
వెబ్సైట్ : www.tgbie.cgg.gov.in

