- BIKKI NEWS : 22-01-2026
Atal pension Yojana scheme extended to 5 years. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన పథకంను మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Atal pension Yojana scheme extended to 5 years
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అసంఘటిత రంగ కార్మికులకు కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పథకంలో చేరడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ అందుతుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 8.66 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొని చెల్లింపులు చేస్తున్నారు.
పోస్టు ఆఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో ఖాతా కలిగిన వాళ్లు నేరుగా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరవచ్చు.

