BIKKI NEWS (SEP. 29) : ASIA CUP TROPHY NOT RECEIVED BY TEAM INDIA. ఆసియా కప్ ప్రెజెంటేషన్‌లో ఏసీసీ చీఫ్, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించిన టీమిండియా ఆటగాళ్లు.
ASIA CUP TROPHY NOT RECEIVED BY TEAM INDIA
దీంతో గంటకు పైగా ఆలస్యమైన ట్రోఫీ బహుకరణ వేడుక. టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ, మెడల్స్ అందుకోకుండానే ముగిసిన ప్రెజెంటేషన్ వేడుక.
ప్రతి మ్యాచ్ టాస్ సమయంలో , ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఈ టోర్నీలో ఏ మ్యాచులోను పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హాండ్స్ ఇవ్వడం జరగలేదు.
చివరకు ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన పాకిస్తాన్ క్రికెట్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం భారత్ ఆటగాళ్లు ఇష్టపడలేదు. దీంతో ట్రోఫీ అందుకోకుండానే సంబరాలు చేసుకున్నారు. దీంతో ప్రపంచ దేశాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.