జీవోలను తక్షణం అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచాలి – హైకోర్టు

జీవోలను తక్షణం అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచాలి - హైకోర్టు - bikki news

BIKKI NEWS (DEC. 24) : All GOs must upload in public domains says high court. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్ని ఉత్తర్వులు (జీవోలు), నోటిఫికేషన్లు, నిబంధనలు, సర్క్యులర్లను తక్షణం ఆయా శాఖల అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

All GOs must upload in public domains says high court.

జీవోలను, సర్క్యులర్లను అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది ‌ దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2023 డిసెంబరు నుంచి 2025 జనవరి దాకా 19,064 జీవోలు జారీచేయగా కేవలం 3,290 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 15,774 జీవోలు కనిపించడం లేదన్నారు.

వాదనలను విన్న న్యాయమూర్తి 2022లో డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని, తక్షణం జీవోలను, ఇతర సర్క్యులర్లను అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →