Scholarship – 60 వేలు అందించే ఆదిత్య బిర్లా స్కాలర్షిప్

Aditya Birla capital scholarship 2025

BIKKI NEWS (NOV. 29) : Aditya Birla capital scholarship 2025. అదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025–26 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

Aditya Birla capital scholarship 2025

సామాన్య వర్గాల నుండి వచ్చిన ప్రతిభావంతమైన విద్యార్థినుల విద్యా స్వప్నాలను సాకారం చేసేందుకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు.

ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం అందించడంతో పాటు, విద్యార్థినులు పాఠశాలల నుండి ప్రీమియర్ విద్యాసంస్థల వరకు ఉత్తమమైన విద్య‌ను గౌరవంతో కొనసాగించేందుకు ప్రోత్సహించడమే లక్ష్యం.

అర్హతలు : దేశవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

9వ తరగతి నుండి 12వ తరగతి వరకు, సాధారణ డిగ్రీ (3 సంవత్సరాలు), ప్రొఫెషనల్ డిగ్రీ (4 సంవత్సరాలు), లేదా Post-Graduation/Professional Courses (IIT, NIT, IIM వంటి ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లు) చేస్తున్న విద్యార్థినులు అర్హులు.

గత విద్యాసంవత్సరంలో కనీసం 60% మార్కులు ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం ₹6 లక్షలలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 07 – 2025 వరకు అవకాశం కలదు.

వెబ్సైట్ : www.b4s.in/namasthe/ABCC13

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK