BIKKI NEWS (OCT. 02) : Interest rates of small savings schemes. చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచాలని నిర్ణయించాయి.
Interest rates of small savings schemes
2025 అక్టోబర్ 1తో మొదలయ్యే త్రైమాసికానికిగాను చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో 2025 డిసెంబర్ 31 వరకు వడ్డీరేట్లలో మార్పు ఉండదు.
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి సమీక్ష చేసే విషయం తెలిసిందే.
సుకన్య సమృద్ధి యోజన : 8.2%
మూడు సంవత్సరాలు డిపాజిట్ : 7.1%
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ : 7.1%
సేవింగ్స్ డిపాజిట్ : 4%
కిసాన్ వికాస పత్ర : 7.5%
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ : 7.7%
నెలవారి ఆదాయ పథకం : 7.4%